గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ సాయి కుమార్ తెలిపారు. బిక్కనూర్లోని బీటీఎస్ చౌరస్తా వద్ద ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హరి సింగ్, బీబీపేటకు చెందిన రోహిత్ గౌడ్, వంశీ అక్రమంగా గంజాయి అమ్ముతున్నట్లు తెలుసుకొని వారిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వారి వద్ద 145 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.