వైద్య ఆరోగ్య శాఖలలో పనిచేస్తున్న ఆశ వర్కర్లను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని సిఐటియు జిల్లా నాయకుడు గోవింద్ రాజు ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లకు కనీస వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదులోని ఇందిర పార్క్ దగ్గర చేపడుతున్న మహాధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లును మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.