ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సులోనే బ్రష్ చేసుకుంటూ మహిళ,,, వైరల్ అవుతున్న వీడియో

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 29, 2024, 07:56 PM

రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించగా.. మహిళలు పూర్తిగా న్యాయం చేస్తున్నారు. మొన్నా మధ్య.. ఓ మహిళ బస్సు ఎక్కి వచ్చి ఓ బస్టాండ్‌లో దిగి ముఖం కడుక్కుని.. మళ్లీ తిరిగి అదే బస్సులో ఇంటికి వెళ్లి పోయింది. అసలు విషయం ఏంటా అని అడిగితే.. ఇంట్లో ఉంటే ఏమీ తోచట్లేదని.. ఇలా చేసినట్టు చెప్పింది. ఈ మాట విన్నవారికి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇదే పీక్స్ అనుకుంటే.. మరో మహిళా మాణిక్యం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. పొద్దుపొద్దున్నే ఏదో పని మీద వెళ్తున్న మహిళ.. గమ్యం చేరుకోవటానికి పట్టే సమయాన్ని ఎందుకు వేస్ట్ చేయాలనుకుందో ఏమో.. బస్సులోనే బ్రష్ చేయటం మొదలుపెట్టింది.


బస్సులో ఎవరైన తనను చూస్తున్నారా లేదా.. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో.. అన్న ఎలాంటి బిడియాలు లేకుండా.. విండో నుంచి బయటికి చూస్తూ.. ప్రకృతిని ఆస్వాధిస్తూ.. బ్రషింగ్ చేస్తుంది. నోటి నిండా బురుగు వచ్చేలా బాగానే రుద్దుతూ కనిపించింది కానీ.. ఎక్కడ ఉమ్మింది.. ఎక్కడ ఫేస్ వాష్ చేసుకుంది అన్నది మాత్రం తెలియరాలేదు. ఎందుకంటే.. ఆ బస్సయితే.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిందని తెలుస్తోంది కానీ.. ఏ మార్గంలోనిది, ఏ డిపోకు చెందిన బస్సు అన్నది మాత్రం తెలియరాలేదు.


అయితే.. ఈ మహిళ డెడికేషన్‌ను.. అదే బస్సులో ఉన్న మరో ప్రయాణికుడు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పెట్టగా.. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ వీడియోపై ట్రోల్స్, మీమ్స్‌ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మహిళ ఓ వర్గానికే ఆదర్శమని.. మహిళల్లోనే మాణిక్యమని.. టైం మేనేజ్మెంట్‌లో పీహెచ్‌డీ చేసిందంటూ రకరకాల మీమ్స్ చేస్తున్నారు. మరోవైపు.. వైరల్ కావాలనే ఆ మహిళ ఈ వీడియో చేసి ఉండొచ్చు అంటూ మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


ఈమెనే కాదండోయ్... ఇలాంటి మహిళా మాణిక్యాలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్నీమధ్యే.. ఇద్దరు మహిళలు.. సీట్‌లో కూర్చుని సీరియస్‌గా వెల్లుల్లిపాయల పొట్టు తీస్తూ కనిపించారు. అంతకుముందు.. కూరగాయలు కట్ చేస్తూ ఒకరు, బీడీలు చేస్తూ మరొకరు.. ఇలా రకరకాల పనులు బస్సుల్లోనే కానిచ్చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. మీమర్స్‌కు మంచి స్టఫ్ ఇస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com