కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టులకు భారీ వరద వస్తుండడంతో నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయానికి నీటి ప్రవాహం మొదలైంది. ఆదివారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 509. 10 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం, 312. 00 టీఎంసీలకుగాను 130. 1471 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. జలాశయానికి ఇన్ ఫ్లో 62, 214 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 5944 క్యూసెక్కులు ఉంది.