హిమాయత్ సాగర్ లోని భూ యజమాన్య శిక్షణ పరిశోధనా సంస్థ (వాలాంతరి)ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల్ల చిన్నారెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా నీటి, భూ యజమాన్య పద్ధతులు, భూసాంద్రత పెంచే తదితర అంశాలను చిన్నారెడ్డి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సంస్థ ఉన్నతాధికారులతో చర్చించిన చిన్నారెడ్డి మాట్లాడుతూ. అధ్యయనం అనంతరం సీఎం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు.