పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా గ్రామాలలో కూలి రేట్లు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రిప్రసాద్ డిమాండ్ చేశారు. బుధవారం తెలకపల్లి మండలంలోని యోగా భవనంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ స్థాయి అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నాయకులు, జిల్లా స్థాయి శిక్షణ సదస్సులు నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు పరికరాలు, పెండింగ్ బిల్లులు సకాలంలో చెల్లించాలన్నారు.