దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ తోడ్పాటు అందించి ఆదుకోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం వనపర్తి ఎకోపార్కులో దివ్యాంగులు నిర్వహించిన సమావేశంలో అఖిలపక్ష నేతలు పాల్గొని మద్దతు తెలిపారు. సతీష్ మాట్లాడుతూ. దివ్యాంగులకు మూడు చక్రాలబండి, రూ. 6వేల పెన్షన్, డబుల్ బెడ్రూంలు కేటాయించాలని డిమాండ్ చేశారు.