వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని రామన్ పాడు జలాశయంలో నీటిమట్టం నిలకడగా కొనసాగుతోంది. జూరాల సమాంతర, ఎడమ కాలువల ద్వారా వచ్చే నీటిని అధికారులు నిలిపివేశారు. బుధవారం సాయంత్రం నాటికి పూర్తి స్థాయి నీటిమట్టం 1, 019 అడుగులకు వచ్చి చేరింది. తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు డ్యాం సెక్షన్ అధికారి ఎఈ సింగిరెడ్డి అనిల్ రెడ్డి తెలిపారు.