చింతలపాలెం మండలంలోని శోభనాద్రిగూడెంలో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్న ఘటనలో ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై సైదిరెడ్డి బుధవారం తెలిపారు. శోభనాద్రిగూడేనికి చెందిన దేశినేని రామారావు, పీక్లానాయక్ తండా వాసి లకావత్ సైదులు మధ్య టిప్పర్ల విషయంలో వివాదం తలెత్తింది. ఈ మేరకు 12 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. అక్రమంగా మట్టి ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.