దశలవారీగా వార్డులో అభివృద్ధి పనులు చేపడగామని కౌన్సిలర్ కాకుమాను సునీల్ తెలిపారు. కమ్మగూడలోని వశిష్ట ఎన్క్లేవ్ లో 13లక్షల నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను బుధవారం ఆయన ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మల్ రెడ్డి అనురాధ సహకారంతో వార్డులో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.