సత్తుపల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో పట్టుబడిన నాలుగు ద్విచక్ర వాహనాలకు ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలంపాట నిర్వహించబడుతుందని ఎక్సైజ్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇట్టి వేలం పాటలో పాల్గొనదలచిన వారు 50 శాతం డిపాజిట్ చెల్లించాలని, వాహనం పొందిన వారు అదే రోజు పాడిన మొత్తాన్ని, 18 శాతం జీఎస్టీతో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని కోరారు.