డల్లాస్‌లో మీడియా మొఘల్ పద్మవిభూషణ్ రామోజీ రావుకు ఘననివాళి సమర్పించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాన్టెక్స్) ఆధ్వర్యంలో రామోజీరావుకు.. ప్రవాసాంధ్రులు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ముఖ్యఅతిథిగా ప్రముఖ రచయిత, నటులు, దర్శకులు తనికెళ్ల భరణి హాజరయ్యారు. రామోజీ రావు ఒక విశిష్ట వ్యక్తి అని, ఏ రంగంపై దృష్టిపెట్టినా ఆ కార్యకలాపాలలో పూర్తిగా నిమగ్నమయ్యేవారని, ప్రతిభకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని.. వ్యక్తిగతంగా ఆయనతో అనేక అనుభవాలున్నాయని, తెలుగు భాష అంటే ఆయనకు ప్రాణమని భరణి చెప్పుకొచ్చారు.