ఆధునిక హంగులతో కశ్మీర్ గడ్డ రైతు బజార్ ను నిర్మిస్తున్నామని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు శుక్రవారం తెలిపారు. నగరంలోని కాశ్మీర్ గడ్డ రైతు బజార్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ. పరిశుభ్ర వాతావరణంలో అన్ని సదుపాయాలతో నగరంలోని నాలుగు చోట్ల సమీకృత మార్కెట్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అందులో ఒకటైన కాశ్మీర్ గడ్డ రైతు బజార్ ను రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నామన్నారు.