రోగులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పీహెచ్ సీలోని మందులు అందజేసే గది, పరీక్షలు చేసే ల్యాబ్, ఇన్ పేషెంట్ వార్డ్ ను పరిశీలించి, రోజూ ఎందరు రోగులు వస్తున్నారని, సీజనల్ వ్యాధుల కేసులపై ఆరా తీశారు. అనంతరం దవాఖాన ఆవరణను పరిశీలించారు.