వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జుక్కల్ ఎమ్యెల్యే లక్ష్మీకాంతరావు వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.