భాషా పండితుల అప్గ్రేడేషన్ హర్షణీయమని దివ్యాంగ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జంగం శ్రీశైలం తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గత 20 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న భాషా పండితుల, పీఈటీల అప్గ్రేడేషన్ పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఆనందం వ్యక్తం చేశారు. భాషా పండితులు, పీఈటీలు గత కొన్ని సంవత్సరాల నుంచి పదోన్నతులు లేకుండా తీవ్ర అవస్థలకు గురయ్యారన్నారు. సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.