నాగిరెడ్డిపేట మండలంలోని మెల్లకుంట తండా గిరిజన విద్యార్థి రామావత్ వీణ ఐఐఎం సంబల్పూర్ ఒడిస్సాలో ఎంబీఏ సీటు సాధించడంతొ శుక్రవారం స్థానిక జడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి రమావత్ వీణను శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మండలంలోని మారుమూల తండాలో పుట్టి ఇలాంటి ప్రతిభ కనపరచడం అభినందనీయం పలువురికి ఆదర్శమన్నారు.