యోగా చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, వ్యాధులను దరి చేరనివ్వదని కామారెడ్డి ఎమ్మెల్యే కెవి. రమణారెడ్డి రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యోగా భవనంలో శుక్రవారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ ఆఫీస్ నిజామాబాద్, పతాంజలి యోగసమితి ఆధ్వర్యంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఎమ్యెల్యే మాట్లాడుతూ యోగ గొప్పతనాన్ని వివరించారు.