జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వేదన నగర్ గురువారం పట్టపగలు జరిగిన దొంగతనం, రాత్రి బాధితులు చూసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయగా శుక్రవారం ఉదయం వరకు పోలీసులు రాకపోవడంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు నంద్యాలకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చేసరికి దొంగతనం జరిగినట్టు బాధితులు ఎమ్మెల్యేకు తెలిపారు. 30తులాల బంగారం, రూ. 3, 50, 000 నగదు దొంగతనం జరిగిందని తెలిపారు.