అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో భారీగా పోలీసు భద్రత ఏర్పాట్లను చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. ఓటింగ్ కు అవసరమయ్యే సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు సెయింట్ జోసెఫ్ స్కూల్, ఖమ్మం రూరల్ మండలం శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & రీసెర్చ్ కాలేజ్ లో సిద్ధంగా వున్న జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు మధ్యప్రదేశ్ , ఒరిస్సా రాష్ట్ర పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.