చంద్రబాబు అరెస్ట్ పై బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇదిలావుంటే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు సెప్టెంబరు 22 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కాగా, చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ హైదరాబాదులోని వనస్థలిపురంలోనూ చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ ర్యాలీలో నిర్వహించారు. అయితే, ఈ ర్యాలీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొనడం విశేషం. ఎల్బీ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన సుధీర్ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ఈ ర్యాలీకి హాజరై టీడీపీ మద్దతుదారులకు సంఘీభావం తెలిపారు. ఇదిలావుంటే ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిమేర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ర్యాలీలో బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి కూడా పాల్గొన్నారు.