పుల్కల్ మండలంలో రేపు మంత్రి హరీష్ రావు పర్యటించనున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు విజయకుమార్ శుక్రవారం తెలిపారు. సింగూర్ ప్రాజెక్టులో చేప పిల్లలను వదలడం, బస్వాపూర్ లో కెనాల్ బ్రిడ్జికి శంకుస్థాపన, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, దివ్యాంగులకు పెరిగిన పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డితో కలిసి మంత్రి పాల్గొననున్నారు.