నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం అజిలాపురంలో ఈ నెల 10న నిండు గర్భిణీ సుస్మిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఈ కేసుకు సంబంధించి పోస్టుమార్టం రిపోర్టులో ఊపిరాడకుండా చేసినట్టు తేలింది. దీంతో మృతురాలితో పాటు భర్త కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.