ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ కార్మీకులు చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరుకుంది. శనివారం జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత 15 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఈనెల 20న జరిగే జిల్లా కలెక్టర్ కార్యాలయం మహాధర్నాను జయప్రదం చేయాలని మిషన్ భగీరథ కార్మిక సంఘం జేఏసి కన్వీనర్ లింగయ్య, కో-కన్వీనర్లు బోగే ఉపేందర్, అల్లూరి లోకేష్, జగజంపుల తిరుపతిలు పిలుపునిచ్చారు.