బహదూర్‌పురా నియోజకవర్గానికి చెందిన పురానాపూల్ కూడలి, వంతెనపై శనివారం ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు, వాహనదాలదారులతో పాటు స్థానికులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటుగా వెళ్లేవారు మరో మార్గంలో ప్రయాణించాలని స్థానికులు సూచిస్తున్నారు. అందరూ ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉంది.