శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని గొల్లపల్లి కి తడి చెత్త, పొడి చెత్త, కార్యక్రమంలో పైలెట్ ప్రాజెక్ట్ గా గుర్తించి, శనివారం చెత్త ఆటోను మున్సిపల్ చైర్ పర్సన్ కోలన్ సుష్మ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. వినాయక చవితి వస్తున్న సందర్భంగా మున్సిపల్ కార్మికులకు బట్టలు, రెయిన్ కోట్లు, పి. పి లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బోగీశ్వర్లు, కౌన్సిలర్ అశోక్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ లక్ష్మయ్య పాల్గొన్నారు.