మల్లాపూర్ మండలం చిట్టాపూర్ లొ గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో గల్ఫ్ కార్మికుల అవగాహన చైతన్య యాత్ర శనివారం నిర్వహించారు. గల్ఫ్ జేఏసీ ఛైర్మన్ గుగ్గిల్ల రవి గౌడ్ గల్ఫ్ కార్మికులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూ రాజ్యాలు మారిన గల్ఫ్ కార్మికుల రాతలు మారడం లేదని గల్ఫ్ కార్మికులపై ప్రభుత్వాల చిన్న చూపును సహించేది లేదన్నారు.