వేములవాడ శ్రీరాజరాజేశ్వర వారిని సోమవారం తెలంగాణ హై కోర్టు జస్టిస్ జె. శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా జస్టీస్ శ్రీనివాసరావుకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు. స్వామి వారి దర్శనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేద పండితులు ఆశీర్వదించారు. వారి వెంట ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.