గద్వాల్ జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో జిల్లా మహా సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సోమవారం ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి హాజరై జ్యోతి ప్రజల్వన చేశారు. ఈ కార్యక్రమానికి టీయుడబ్లూజే ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ సార్, కార్యదర్శి పేపర్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర రావు, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు దత్తు, పాల్గొన్నారు.