మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సోమవారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆసీనులయ్యారు. అనంతరం తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రవి నాయక్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎస్పీ నరసింహ, తదితరులు పాల్గొన్నారు.