ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బ్రిందా' ట్రైలర్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 22, 2024, 04:55 PM

సూర్య వనగల దర్శకత్వంలో చెన్నై తెండ్రాల్ త్రిష తెలుగులో 'బ్రిందా' అనే వెబ్ సిరీస్ లో నటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సోనీ LIV సొంతం చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ సోనీ లైవ్‌లో ఆగష్టు 2న ప్రసారానికి అందుబాటులోకి రానుంది. తాజాగా స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ఈ సిరీస్ యొక్క ట్రైలర్ ని విడుదల చేసింది. ఈ సిరీస్ లో త్రిష ఎస్‌ఐ బృందా పాత్రను పోషిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్‌గా ట్రాక్ లో రానున్న ఈ సిరీస్ లో సాయి కుమార్, ఆమని, ఇంద్రజిత్ సుకుమారన్, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా తన సోదరుడు ఆశిష్ కొల్లాతో కలిసి ఈ వెబ్ సిరీస్‌ ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com