ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన శివకార్తికేయన్ 'అమరన్ మూవీ...

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 18, 2024, 01:38 PM

 కోలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ యాక్టర్లలో ఒకరు శివకార్తికేయన్‌ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన శివకార్తికేయన్‌ కాంపౌండ్ నుంచి రాబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ చిత్రాల్లో ఒకటి SK21. రాజ్‌కుమార్‌ పెరియసామిదర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 'అమరన్‌' టైటిల్‌తో తెరకెక్కుతోంది.తాజాగా రిలీజ్ డేట్ అన్నోన్స్ చేసారు మేకర్స్. అక్టోబర్‌ 31న దీపావళి కానుకగా అమరన్‌ ప్రేక్షకుల ముందుకు వస్తోంది అంటూ ట్వీట్ చేశారు మేకర్స్‌. శివకార్తికేయన్‌ రక్తపు మరకలతో కనిపిస్తుండగా.. బ్యాక్‌ డ్రాప్‌లో జాతీయ జెండాను చూడొచ్చు. ఈ లుక్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో సాయిపల్లవి ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తుండగా విశ్వరూపం ఫేం' రాహుల్ బోస్‌' విలన్‌గా నటిస్తున్నాడు.  ఇప్పటికే ఎస్‌కే 21 కశ్మీర్‌ షూటింగ్‌ లొకేషన్‌లో సాయిపల్లవి, శివకార్తికేయన్‌ దిగిన ఫొటోలు నెటిజన్లను ఇంప్రెస్ చేస్తున్నాయి. మరోవైపు సినిమా కోసం గైడ్‌ చేసిన రియల్‌ హీరోలు ఇండియన్ మిలటరీ జవాన్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ అమరన్‌ టీం రిలీజ్ చేసిన వీడియో ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com