ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కబ్జా' డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్ఫారం

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2023, 05:10 PM

ఆర్ చంద్రు దర్శకత్వంలో శాండల్‌వుడ్ స్టార్ హీరోస్ ఉపేంద్ర అండ్ కిచ్చా సుదీప్ నటించిన మల్టీస్టారర్ 'కబ్జా' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో శివ రాజ్‌కుమార్ అతిధి పాత్రను పోషించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ యాక్షన్ డ్రామా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం.


ఈ పాన్ ఇండియా మూవీలో మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి, శ్రియా శరణ్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, ఎం కామరాజ్, కబీర్ దుహన్ సింగ్, బొమన్ ఇరానీ కనిపించనున్నారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్‌ప్రైజెస్ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ కి రవి బస్రూర్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com