మాస్ రాజా రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం "రావణాసుర". రీసెంట్‌గానే ఈ సినిమా నుండి థర్డ్ సింగిల్ 'వెయ్యిన్నొక్క' అనే రెట్రో స్టైల్ లో ఉండే పెప్పి సాంగ్ విడుదలయ్యింది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు సాహిత్యం అందించారు. వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే... ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే.. అని సాగే ఈ పాట హీరోయిన్ మేఘా ఆకాష్ ని రవితేజ టీజ్ చేస్తూ పాడతారు. ఈ క్లాసిక్ ట్యూన్ కి ఆడియన్స్ నుండి 2 మిలియన్ వ్యూస్ తో డీసెంట్ రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోస్ లో ఒకటిగా దూసుకుపోతుంది.
సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కాబోతుంది. రవితేజ, అభిషేక్ నామ నిర్మించారు.