అల్లరి నరేష్ నటిస్తున్న సరికొత్త చిత్రం "ఉగ్రం". విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఇంటెన్స్ పోలీస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మిర్నా హీరోయిన్ గా నటిస్తుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. "దేవేరి" అనే బ్యూటిఫుల్ రొమాంటిక్ మెలోడీ వీడియో సాంగ్ మార్చి 19 సాయంత్రం 04:05 నిమిషాలకు విడుదల కాబోతున్నట్టు పేర్కొంటూ కొంతసేపటి క్రితమే మేకర్స్ నుండి అఫీషియల్ పోస్టర్ విడుదలయ్యింది.