నాగచైతన్య, కృతిశెట్టి జంటగా నటిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం "కస్టడీ". నిన్న సాయంత్రమే ఈ సినిమా టీజర్ విడుదల కాగా, తెలుగు, తమిళ భాషల ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోస్ లో దూసుకుపోతూ, ఇప్పటివరకు 10 మిలియన్ రియల్ టైం వ్యూస్ ని రాబట్టింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న కస్టడీ తెలుగు, తమిళ భాషల్లో మే 12న విడుదల కాబోతుంది. ఇందులో అరవింద్ స్వామి, ప్రియమణి కీరోల్స్ లో నటిస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.