ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్కార్ విన్నర్ పై మండిపడుతున్న నెటిజన్లు

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2023, 02:56 PM

గ్లోబల్ సెన్సేషన్ "RRR" లోని నాటు నాటు పాటకు అత్యున్నతమైన ఆస్కార్ పురస్కారం వచ్చిన విషయం తెలిసిందే. ఎం ఎం కీరవాణి స్వరకల్పనలో రూపొందిన ఈ పాటను సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఆలపించగా, చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఆస్కార్ వేదికపై సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వగా, దానికి స్టాండింగ్ ఒవేషన్ రెస్పాన్స్ వచ్చింది.


తాజాగా ఆస్కార్ వేదికపై తన ప్రదర్శనను ఉద్దేశిస్తూ కాలభైరవ చేసిన ట్వీట్ ఒకటి విమర్శలకు దారి తీసింది. అకాడెమీ స్టేజిపై లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. ఇందుకు సహకరించిన రాజమౌళి బాబా, న్నా, ప్రేమ్ రక్షిత్, కార్తికేయ అన్న, అమ్మ, పెద్దమ్మ.. అందరికీ కృతజ్ఞతలు.. అంటూ కాలభైరవ ట్వీట్ చెయ్యగా, అందులో హీరోలు రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల పేర్లు ప్రస్తావించకపోవడంతో, నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు. 


తదుపరి కాలభైరవ సంజాయిషీ ఇస్తూ మరొక ట్వీట్ చేసారు. తన ట్వీట్ ను తప్పుగా అర్ధం చేసుకున్నారని, ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com