విద్య ప్రతి ఒక్కరు హక్కు, నాణ్యమైన విద్య ప్రతిఒక్కరికీ అందాలి.. అనే ఇతివృత్తంతో తెరకెక్కిన "సార్/ వాతి" మూవీ, ఇటీవలే థియేటర్లలో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా 100కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
తాజాగా ఈ సినిమా నుండి క్లైమాక్స్ లో వచ్చే ఒక డిలీటెడ్ సీన్ ని కొంతసేపటి క్రితం మేకర్స్ విడుదల చెయ్యడం జరిగింది. సార్ మూవీ ఏ స్టూడెంట్ తో ఐతే స్టార్ట్ అవుతుందో.. అదే స్టూడెంట్ స్టేజ్ మీద మాట్లాడుతూ తనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది త్రిపాఠి ఇన్స్టిట్యూట్స్ వల్ల కాదు.. బాల సార్.. బాలగంగాధరతిలక్ సర్ వల్ల అని చెప్పే ఈ సీన్ నిజంగా చాలా బాగుంది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.