థియేటర్లలో, ఓటిటిలో సూపర్ హిట్ ఐన రీసెంట్ బ్లాక్ బస్టర్ హర్రర్ థ్రిల్లర్ "మసూద" కొన్ని రోజుల క్రితమే ప్రముఖ బుల్లితెర ఛానెల్ జెమినీ టీవిలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అయ్యింది. బుల్లితెర ప్రేక్షకుల నుండి 5.2 TRP రూపంలో అమేజింగ్ రెస్పాన్స్ అందుకుంది. ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేని ఈ చిన్న సినిమాకు ఆ మాత్రం రేటింగ్ అంటే గొప్ప విషయమే మరి.
సాయి కిరణ్ దర్శకత్వంలో తిరువీర్, కావ్యా కళ్యాణ్ రామ్, సంగీత ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాను రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూట్ చేసారు.