టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అందరు స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ని కొన్నేళ్లపాటు ఎంజాయ్ చేసిన సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గారు లేటెస్ట్ గా ఒక క్రేజీ సినిమాలో కీరోల్ లో నటించబోతున్నారు.
హీరో ఆది పినిశెట్టి కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'వైశాలి' కి సీక్వెల్ గా "శబ్దం" మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్ ప్రకారం, శబ్దం సెట్స్ లో సిమ్రాన్ గారు జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు చిత్రబృందం అఫీషియల్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ సినిమాకు అరివాజగన్ వెంకటాచలం దర్శకుడు కాగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. లక్ష్మి మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.