గ్లోబల్ సెన్సేషన్ RRR లోని నాటు నాటు పాటతో ఆస్కార్ కైవసం చేసుకుని, భారతీయులను గర్వంగా తలెత్తుకునేలా చేసి, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆస్కార్ అవార్డుల కార్యక్రమం తదుపరి తొలిసారి 'ధమ్కీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా అభిమాన గణంతో ముచ్చటించబోతున్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించి, దర్శకత్వం కూడా చేస్తున్న ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరగబోతుంది. తారక్ చీఫ్ గెస్ట్ గా రాబోతుండడంతో ఈ ఈవెంట్ కోసం అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.