ఒకదానిని మించి మరొకటి అద్భుతమైన లిరికల్ సాంగ్స్ తో శ్రోతలను మెప్పిస్తున్న "రంగమార్తాండ" చిత్రం నుండి కాసేపటి క్రితమే 'దమిడి సేమంతి' అనే బ్యూటిఫుల్ సాంగ్ విడుదలయ్యింది. ఇళయరాజా గారి స్వరకల్పనలో రూపొందిన ఈ గీతాన్ని సింగర్ రాహుల్ నంబియార్ అద్భుతంగా పాడారు. బల్ల విజయ్ కుమార్ లిరిక్స్ అందించారు.
కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అనసూయా భరద్వాజ్ ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.