కొన్ని నిమిషాల క్రితమే నాగచైతన్య హీరోగా నటిస్తున్న "కస్టడీ" మూవీ టీజర్ విడుదలయ్యింది. కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఇంటెన్స్ పోలీస్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ యొక్క టీజర్ ఎలా ఉందంటే..
గాయపడిన మనసు ఆ మనిషిని ఎంతదూరమైనా తీసుకెళ్తుంది. అది ఇప్పుడు నన్ను తీసుకొచ్చింది ఒక యుద్దానికి.. అంటూ హీరో నాగచైతన్య చెప్పే సీరియస్ డైలాగ్ తో టీజర్ ఆరంభమవుతుంది. ఇక్కడ చావు నన్ను వెంటాడుతుంది. అది ఎప్పుడు, ఎలా వస్తుందో నాకు తెలియదు. తెలుసుకోవాలని కూడా లేదు.. ఎందుకంటే,, నా చేతిలో ఉన్న ఆయుధం ఒక నిజం... నిజమొక ధైర్యం, నిజమొక సైన్యం.. ఆ నిజం నా కస్టడీలో ఉంది... అని నాగచైతన్య చెప్పే ఇంటెన్స్ డైలాగులతోనే టీజర్ మొత్తం నడుస్తుంది. ఇక, అరవింద్ స్వామిని ఈ సినిమాలో డిఫరెంట్ మెకోవర్లో మనం చూడవచ్చు. మొత్తానికి కస్టడీ టీజర్ చాలా బాగుంది.
ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అరవింద్ స్వామి, ప్రియమణి, ప్రేమ్ జీ, అమరేన్, వెన్నెల కిషోర్ కీరోల్స్ లో నటించారు. ఈ సినిమాకు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మే 12న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది.