గతేడాది 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్' సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న యంగ్ హీరో విశ్వంత్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "కథ వెనుక కథ". ఈ సినిమాలో సునీల్ కీరోల్ లో నటిస్తున్నారు.
తాజాగా కథ వెనుక కథ ట్రైలర్ విడుదలయ్యింది. టీజర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ట్రైలర్ తో ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. హీరోకి రాక రాక దర్శకత్వం చేసే అవకాశం వస్తుంది. ఖర్మకాలి ఆ సినిమాలో నటిస్తున్న ఐదుగురు అమ్మాయిలు మిస్ అవుతారు. యూనిట్ లో ఉండే అందరూ కూడా దర్శకుడిపైనే తమకు అనుమానం ఉందని చెప్తారు. మరి, ఏ పాపం తెలియని హీరో తన మీద ఉన్న నిందని ఎలా పోగొట్టుకుంటాడు? అసలు ఆ ముగ్గురు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు చేసారు? ... ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలనే కుతూహలాన్ని ట్రైలర్ తో ఆడియన్స్ లో కలుగజేసారు చిత్రబృందం.
ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకుడు కాగా, దండమూడి అవనీంద్ర కుమార్ నిర్మిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈనెల 24న విడుదల కాబోతుంది.