యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన కొత్త చిత్రం "శ్రీదేవి శోభన్ బాబు" నుండి కొంతసేపటి క్రితం నిను చూసాక... అనే బ్యూటిఫుల్ లవ్ వీడియో సాంగ్ విడుదలయ్యింది. ఈ పాటను కమ్రాన్ స్వరపరచగా, రాకేందు మౌళి సాహిత్యం అందించారు. జునైద్ కుమార్ ఆలపించారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాలో గౌరీ జి కిషన్ హీరోయిన్ గా నటించింది. మెగాస్టార్ చిరంజీవి గారి పెద్ద కూతురు సుస్మిత, విష్ణు ప్రసాద్ నిర్మించారు. పోతే, మార్చి 30నుండి డిస్నీ ప్లస్ హిట్ స్టార్ లో శ్రీదేవి శోభన్ బాబు మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది.