రీసెంట్గా విడుదలైన సినిమాలలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన "సార్ /వాతి" తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన ఈ ఫీల్ గుడ్ సోషల్ మెసేజ్ ఎంటర్టైనర్ ఇకపై డిజిటల్ లో సందడి చేసేందుకు సిద్ధమయ్యింది. మరి కొన్ని గంటల్లోనే అంటే, ఈ రోజు అర్థరాత్రి నుండి నెట్ ఫ్లిక్స్ లో సార్/ వాతి మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది.
వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకుడు కాగా, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.