హాస్యబ్రహ్మ బ్రహ్మానందం పుట్టినరోజు ఈ రోజు. దీంతో బ్రహ్మానందం నటిస్తున్న 'కీడాకోలా' చిత్రం నుండి సర్ప్రైజ్ బర్త్ డే వీడియో విడుదలైంది. ఈ రోజు ఉదయమే కీడా కోలా చిత్రబృందం బ్రహ్మానందం గారిని 'వరదరాజులు' గా పరిచయం చేస్తూ, ఆయన క్యారెక్టర్ పోస్టర్ విడుదల చేసారు. తాజాగా విడుదల చేసిన సర్ప్రైజింగ్ వీడియోలో బ్రహ్మానందం గారు సెట్స్ లో ఎంత జోవియల్ గా ఉన్నారో, ఎంత యాక్టివ్ గా యాక్ట్ చేసారో ... క్లియర్ గా చూడొచ్చు.
కొంత గ్యాప్ తదుపరి డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. వీజీ సైన్మా బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కబోతున్న ఈ మూవీని శ్రీపాద్ నందిరాజ్, సాయికృష్ణ గద్వాల్, ఉపేంద్ర వర్మ, వివేక్, కౌశిక్ నండూరి నిర్మిస్తున్నారు.