క్రేజీ హీరోయిన్ సమంత, క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ కలయికలో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ "శాకుంతలం". ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఏడాదికిపైగా సమయాన్ని తీసుకున్న శాకుంతలం గతేడాది ఆగస్టులో విడుదల కావాల్సి ఉండగా, 3డి విజువల్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల నిమిత్తం విడుదల తేదీని ఫిబ్రవరి 17, 2023 కి మేకర్స్ వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఐతే, తాజా బజ్ ప్రకారం మహాశివరాత్రి రేస్ నుండి శాకుంతలం మూవీ తప్పుకున్నట్టుగా టాక్ నడుస్తుంది. మరి, ఇందుకు గల కారణాలు ఏంటి? అసలు ఈ వార్తలో నిజముందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని సామ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్త బ్యానర్లపై నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దేవ్ మోహన్, వరలక్ష్మి శరత్ కుమార్, మోహన్ బాబు, అల్లు అర్హ కీరోల్స్ లో నటిస్తున్నారు.