ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హన్సిక వెడ్డింగ్ ...లవ్ షాదీ డ్రామా టీజర్ విడుదల ..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 07:00 PM

గతేడాది డిసెంబర్ 4వ తేదీన రాజస్థాన్, జైపూర్, ముందోట కోటలో స్నేహితుడు, బిజినెస్ పార్టనర్ సోహెల్ కతూరియా తో ఏడడుగులు నడిచి అఫీషియల్ గా వివాహ జీవితాన్ని ప్రారంభించింది స్టార్ హీరోయిన్ హన్సిక. తన వివాహాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఎక్స్క్లూజివ్ గా స్ట్రీమింగ్ కి తీసుకురాబోతున్నట్టు గతంలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసింది. లవ్ షాదీ డ్రామా పేరిట డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో హన్సిక వివాహ మహోత్సవ వేడుకలను మనందరం చూడొచ్చు. 


తాజాగా లవ్ షాదీ డ్రామా టీజర్ విడుదలైంది. ఇందులో హన్సిక సోహెల్ కతూరియాను పెళ్లాడేటందుకు చాలా ఇబ్బందులు పడినట్టుగా తెలుస్తుంది. సోహెల్ కి గతంలోనే పెళ్లయ్యింది. అదికూడా హన్సిక స్నేహితురాలితో. దీంతో హన్సిక పెళ్లి ముందు సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివ్ ప్రచారం జరిగింది. ఇవన్నీ తనకు చాలా బాధ కలిగించాయని హన్సిక ఎమోషనల్ అయినట్టుగా కనిపిస్తుంది ఈ టీజర్లో. ఇక పోతే, ఫుల్ లవ్, ఫుల్ షాదీ, ఫుల్ డ్రామా చూడాలంటే ఫిబ్రవరి 10వరకు ఆగాల్సిందే. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com