కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గారి కెరీర్ లో 125వ చిత్రంగా తెరకెక్కిన చిత్రం "వేద". రీసెంట్‌గానే కన్నడలో విడుదలై, ఘనవిజయం సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా అదే టైటిల్ తో విడుదల కాబోతుంది. A హర్ష డైరెక్షన్లో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో గానవి లక్ష్మణ్ హీరోయిన్ గా నటించింది. అర్జున్ జన్య సంగీతం అందించారు. గీత పిక్చర్స్, జీ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై గీత శివరాజ్ కుమార్ నిర్మించారు.
లేటెస్ట్ గా, వేద రిలీజ్ డేట్ ను మేకర్స్ ఎనౌన్స్ చెయ్యడం జరిగింది. ఈ మేరకు వచ్చే నెల 9వ తేదీన వేద మూవీ ఇరు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో సందడి చెయ్యడానికి రెడీ అవుతుందని తెలుస్తుంది.